- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలని పంచాయతీ డివిజనల్ అధికారి మల్లిఖార్జున రెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజాపాలనలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో 99 రోజుల షెడ్యూల్ ప్రకారంగా పనులు జరగాలని,నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



