వారి ఆశయాలను కొనసాగిస్తాం:జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్
న
వతెలంగాణ-సూర్యాపేట
ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వారి త్యాగాలు వృథా కావని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ అన్నారు. అమరవీరుల యాదిలో స్ఫూర్తి యాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చేరుకుంది. లోడంగి బాలస్వామి కుటుంబ సభ్యులను నాయకుల పరామర్శించారు. బాలస్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో గోపాల్ మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఏర్పడి 30 ఏండ్లు అవుతున్న సందర్భంగా నాటి నుంచి నేటి వరకు ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన వారి కుటుంబాలను కలుస్తున్నామన్నారు. ఆ పోరాట యోధులు చేసిన అసమాన త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా 40 కుటుంబాలను కలుస్తున్నామని వివరించారు. చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్, వ్యాక్సిన్, గొర్రెల పంపిణీ, వంటి అనేక చట్టాలను సంఘం తరపున పోరాడి సాధించామని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా నేటికీ గొర్రెల కాపరులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు నిత్యం దొంగల బారినపడి నష్టపోతున్నారని తెలిపారు. కర్నాటక తరహాలో గొర్రెల కాపర్ల రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లు నిండిన వారికి రూ.7వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. గొర్రెల కాపర్ల సమస్యలు పరిష్కరించపోతే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్, రాష్ట్ర నాయకులు చల్ల మల్లయ్య, జిల్లెల్ల పెంటయ్య, రాష్ట్ర నాయకులు మట్టిపెళ్లి సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుంజ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రణఫంగ కృష్ణ, నాయకులు లోడంగి రామస్వామి, పాశం వెంకటనారాయణ, లోడంగి శ్రీరాములు, అబ్రు, లోడంగి సైదులు, రణపంగా సాలయ్య, లోడంగి బాలస్వామి కుటుంబ సభ్యులు పద్మ, కుమారుడు మధు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు వృథా కావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


