సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాషా తడాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పిన విధానం, పాత్రలను, అందులోని ప్రేమ, ఎమోషన్‌ను తీర్చిదిద్దిన తీరు నాకు ఎంతగానో నచ్చాయి. కథ వింటున్నప్పుడు ఆయన ప్రతి పాత్రను ఎంతగా ప్రేమించారో నాకు అర్థమైంది. ఆ ఎమోషన్‌ను నేను కూడా ఫీల్ అయ్యాను. ఇది చాలా అద్భుతమైన కథ.
మంగాగా నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకవైపు చాలా బబ్లీగా, ఎక్సైటెడ్‌గా ఉంటుంది. మరోవైపు చాలా పద్ధతిగా, హుందాగా ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది. నా పాత్రకు రెండు విభిన్న కోణాలు ఉన్నాయి.
జయకృష్ణ చాలా స్వీట్ అండ్ కూల్ పర్సన్. మోహన్ బాబుతో పని చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియెన్స్.
వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ నుంచి మహేష్ బాబు తో పాటు ఎంతో మంది స్టార్స్ పరిచయం అయ్యారు. నా జీవితంలో కలిసిన బెస్ట్ పర్సన్లలో అశ్విని దత్ ఒకరు. ఆయన నన్ను ఎప్పుడూ మనవరాలిలా చూసుకునేవారు. ఇందులో యాక్షన్, లవ్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది.
ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. ఆరు పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. నాకు ఈ సినిమాలోని అన్ని పాటలూ ఫేవరెట్. జీవీ ప్రకాష్ సంగీతం నిజంగా మ్యాజిక్‌లా ఉంటుంది.
ఒకే పాత్రలో రెండు కోణాలు..
- Advertisement -
- Advertisement -


