Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్‌పై అప్రమత్తత

సర్‌పై అప్రమత్తత

- Advertisement -

పోడు సాగుదారుల పట్ల మానవత్వంతో ఉండాలి :
మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘సర్‌’ 2026పై అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనేతర పోడు రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అధికా రులకు సూచించారు. శనివారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి మాణిక్‌గూడ గ్రామంలో పంచాయతీ భవనం, కెరమెరి మండలం ధనోరాలో వీఓ భవనం, వాంకిడి మండలం కోమటిగూడలో గ్రామపం చాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోడు సాగు దారుల సమస్యలు కేంద్రం మాత్రమే పరిష్కరి స్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండ దని చెప్పారు. గిరిజనేతరులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ఎటువంటి హక్కులను కల్పించదని గుర్తు చేశారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా తక్కు వగా సాగు చేసుకుంటున్న రైతులను మానవతా దృక్పథంతో ఆలోచించి ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులకు సూచించారు. అటవీ అధికారులతో తాను మాట్లాడతానని, రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో కొంతకాలంగా సుర్దాపూర్‌లో జరుగుతున్న పోడు రగడ మంత్రి హామీతో ఆగనుంది. అనంతరం సర్‌పై జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఓటర్లకు సహాయం చేయడంతో పాటు వారు తప్పనిసరిగా సర్‌లో నమోదు చేసుకునే విధంగా సహకరించాలని చెప్పారు. ఎక్కడైనా ఇబ్బం దులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నా రు. కేసీఆర్‌ కుటుంబం 9 సంవత్సరాల పాలనలో దోచుకుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. యువతను పక్కదారి పట్టిస్తూ కేసుల వైపు నడిపించి తన కుటుంబాన్ని మాత్రం అమెరికా వైపు.. ఉన్నత శిఖరాల వైపు నడిపిం చిన గొప్ప నేత కేసీఆర్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు వివరిం చారు. తాడిచెర్ల సింగరేణి గనులు సింగరేణికి అప్పజె ప్పేలా చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుం దన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ దండే విటల్‌, ఎమ్మెల్యే కోవలక్ష్మీ, రాష్ట్ర గ్రంథా లయ సంస్థ చెర్మెన్‌ రియాజ్‌, జిల్లా కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ మర్మాట్‌ యువరాజ్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌, డీసీసీ అధ్యక్షులు సుగుణ, జిల్లా గ్రంథా లయ చైర్మెన్‌ అనిల్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, మాజీ డీసీసీ విశ్వప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాం నాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -