నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలో ఈనెల 16వ తేదీ వరకు ఎస్ఐఆర్ పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. మండలంలో ఎస్ఐఆర్ కు సంబంధించిన వివరాలను తాసిల్దార్ శ్రీలతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఈనెల 16 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ ను డిజిటలైజేషన్ తో పూర్తి చేయాలని అన్నారు. ఓటర్ షిఫ్టింగ్, మరణించినవారు, వలస వెళ్లిన వారి ఓటర్లను విచారణ జరిపి తొలగిస్తున్నట్లు ప్రత్యేకంగా గుర్తించి ఆజాబితను ప్రత్యేకంగా తయారు చేయాలని సూచించారు.
జాబితాను గ్రామాల్లో ఉన్న ఆయా పార్టీల నాయకుల సమక్షంలో విడుదల చేసి, వారి సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, జిపిఓ లను ఇందుకు ఉపయోగించుకోవాలని తాసిల్దారును కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యాలయానికి మొదటిసారిగా కలెక్టర్ రావడంతో సర్పంచ్ ఆరిపోద్దిన్ కలెక్టర్ ను మొక్కను అందించారు. గ్రామపంచాయతీ ఆవరణ పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉండటంతో, సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంతరావు, ఆర్ ఐ నారాయణరావు పటేల్, పంచాయతీ కార్యదర్శి ఆనంత్ రావు, బిఎల్వోలు రేష్మా, అర్షియాతబస్సం తదితరులు, పాల్గొన్నారు.


