Monday, July 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులకు నూలిపురుగు మాత్రల పంపిణీ

విద్యార్థులకు నూలిపురుగు మాత్రల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ విజేష్ విద్యార్థులకు నులిపురుగులు మాత్రలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న 1-19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగులు మందులు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. నులిపురుగులు మాత్రల ద్వారా రక్త హీనత, ఎదుగుదల లోపించడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాలం దృష్టిలో ఉంచుకొని మన చుట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్ ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -