జూలై 15 నుండి కోచింగ్ సెంటర్స్ ప్రారంభం
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో త్వరలోనే రాబోయే ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్న పేద విద్యార్థుల కోసం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్ ను రెండోసారి ఏర్పాటు చేయబోతున్నారు.గత సంవత్సరంలో నిర్వహించిన మాదిరిగానే రెండు నెలలు పాటు మంథని,కాటారం హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాట్లు చెయనున్నారు.ఈ సెంటర్స్ లో ముత్తారం,రామగిరి,కమాన్ పూర్,పాలకుర్తి, కాటారం,మహా ముత్తారం,మహాదేవపూర్,మలహర్ రావు, పలిమెల ఇతర మండలాలతో పాటు పెద్దపల్లి,భూపాల పల్లి జిల్లాలోని చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాల పోటీపరీక్షలకు వారి నైపుణ్యాన్ని పెంచడానికి శ్రీ విశ్వ అకాడమీ కోచింగ్ సెంటర్ ను మంథని/ కాటారంలో వారం రోజులలో ఏర్పాటు చేయబోతున్నారు.
అనేక సంవత్సరాలుగా అనుభవం కలిగిన హైదరాబాద్ లెక్చరర్ల సారధ్యంలో కోచింగ్ సెంటర్ నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు.ఉదయం 10:00 గంటల నుండి 6:00 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని తెలిపారు.కోచింగ్ తీసుకోవాలనుకునే నిరుద్యోగులు మంథని,కాటారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకొని రెండు ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ వారి విద్యాపరమైన సర్టిఫికెట్లు జతపరిచి క్యాంపు కార్యాలయంలో అందజేయాలని కోరారు.ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు ఉచిత కోచింగ్ సెంటర్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.



