Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర 
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీడీవో సురేష్, సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్, వైద్యాధికారి డాక్టర్ నందనా దేవి ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్న వారందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగు పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ మహిపాల్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు రాజలింగం, ఏఎన్‌ఎం హరిత, ఉపాధ్యాయులు సదయ్య, శ్రీధర్, సత్యం, సారయ్య, ప్రభాకర్, కరుణ, హైమ, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -