నవతెలంగాణ – ఆలేరు రూరల్
మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రీ ప్రైమరీ విభాగాలకు ఇటీవల ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు,ఆయాలు గురువారం విధుల్లో చేరారు.ప్రభుత్వం చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యంతో చేపట్టిన నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన సిబ్బంది ఆయా పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు.ఎంపీపీఎస్ బహదూర్‌పేటలో ఇన్‌స్ట్రక్టర్‌గా అంగడి అరుణ, ఆయాగా సాంబరాజు స్వప్న,ఎంపీపీఎస్ కొలనుపాకలో ఇన్‌స్ట్రక్టర్‌గా బొడ్డు అశ్విని,ఆయాగా బోయిని రేణుక,ఎంపీపీఎస్ గొలనుకొండలో ఇన్‌స్ట్రక్టర్‌గా జేరిపోతుల అశ్విని,ఆయాగా జోలం కవిత,ఎంపీపీఎస్ టంగుటూరులో ఇన్‌స్ట్రక్టర్‌గా శాతెల్లి రేణుక, ఆయాగా గజరాజు శిరీష,ఎంపీపీఎస్ శ్రీనివాసపురంలో ఇన్‌స్ట్రక్టర్‌గా మచ్చ రజిత, ఆయాగా ఏంటుక రవళి విధుల్లో చేరినట్లు మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ తెలిపారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మండల విద్యాధికారి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది రాధిక, చైతన్య,తిరుపతి, బాబా పాల్గొన్నారు.
ప్రీ ప్రైమరీ పాఠశాల విధుల్లో చేరిన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



