నియామక ప్రక్రియ ప్రారంభం : డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ లాల్
నవతెలంగాణ-అచ్చంపేట
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నియామకానికి ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1171 విడుదల చేయడంతో గెస్ట్ లెక్చర్ల నియామక ప్రక్రియ సులభ తరం అయిందని డిగ్రీ గెస్ట్ లెక్చరర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర ఈశ్వర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో 2784 కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లు, ఔట్సోర్సింగ్, టీ ఎస్ కే సి 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అనుమతి తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల నియామకం ఆలస్యం కావడంతో విద్యార్థులు నెలరోజుల సిలబస్ కోలుపోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పాతవారినే కొత్త నోటిఫికేషన్ మరియు త్రీ మెన్ కమిటీతో డెమో తీసుకునే విధానాన్ని రద్దుచేసి గత సంవత్సరం పనిచేసిన వారిని రెన్యువల్ చేయాలన్నారు. పీరియడ్, యూనివర్సిటీల అల్మానక్ తో అనుసంధానమైన వేతన విధానాన్ని రద్దుచేసి యుజిసి లేదా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అకాడమిక్ ఇయర్ మొత్తానికి ప్రతి నెల 50 వేల కన్సాలిడేట్ పే గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. –
డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



