నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు కోరారు. ఈ విషయమై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ను కలిసి వినతిపత్రం అందజేశారు. గురుకుల మరియు మోడల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరారు. సీనియర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య, రత్నాకర్ రావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్ సింగ్, నర్ర నవీన్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విట్టల్ గౌడ్ హాజరయ్యారు.
ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



