Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం.!

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం.!

- Advertisement -

జిల్లా స్థాయిలో నిలిసిన విద్యార్థినికి రూ.2 లక్షల నగదు అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు

శ్రీరామ్ లైప్ ఇన్సరెన్స్ కంపెనీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని శ్రీరామ్ లైప్ ఇన్స్ రెన్స్ సీనియర్ ఏజెంట్ గాదె ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి జిల్లా ప్రతిమ స్థానంలో నిలిసిన విద్యార్థిని మేనం ప్రణవికి చదువుకో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2 .లక్షల నగదు బహుమతిని సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ తిరుపతి,సర్పంచ్ బండి స్వామి ఉపసర్పంచి బొబ్బిలి రాజు,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినయ్ భాస్కర్,భూపాల్ పల్లి మేనేజర్ సంతోష్ ,మంథని బ్రాంచ్ మేనేజర్ కొట్టే సాగర్,డెవలప్మెంట్ తోట వెంకటస్వామి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్సే ఆఫీసర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -