Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, సర్టిఫికెట్ ఫోల్డర్ లు పంపిణీ

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, సర్టిఫికెట్ ఫోల్డర్ లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, సర్టిఫికెట్ ఫోల్డర్ లు పంపిణీ చేశారు. విద్యార్థులకు గ్రామ ఉప సర్పంచ్ మోర్తాడ్ ఉదయ్ పరీక్ష ప్యాడ్లు, ఫైల్ ఫోల్డర్ లు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా, రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

వార్షిక పరీక్షలు రాయడానికి విద్యార్థులకు అవసరమైన ప్యాడ్ లు, వివిధ రకాల సర్టిఫికెట్లు శాశ్వతం గా భద్రపరచుకొనేందుకు ఫోల్డర్ ఫైల్లు అందించినందుకు మోర్తాడ్ ఉదయ్ ను ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్,పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కొత్తచెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నోళ్ల రెడ్డి, మహోదయ స్కూల్ కరస్పాండెంట్ మోర్తాడ్ ఉమేష్,  క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య, సౌత్ కొరియా విశ్వ విద్యాలయం ఫిజిక్స్ ప్రొఫెసర్ శనిగరపు మల్లేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -