Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండాలో వ్యాకాస నాయకుల సర్వే 

తండాలో వ్యాకాస నాయకుల సర్వే 

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి  
వనపర్తి జిల్లా ఏదుల మండలం గుండ్య వాల్య నాయక్ తాండ గ్రామ పంచాయతీలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన తండా సమస్యలపై సంఘం జిల్లా కార్యదర్శి మేకల ఆంజనేయులు, సంఘం నాయకులు ఎండి మౌలాలి లు సోమవారం సర్యే చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ  కరువు ఛాయలు ఏర్పడుతున్నాయని, మోడీ తెచ్చిన కొత్త చట్టం వల్ల ఉపాధి పని లేక పట్టణాలకు వలసకు సిద్ధమవుతున్నామని గిరిజనులు తెలిపారు. గిరిజనుల వలసల నివారణ కోసం ఉపాధి పనులను ప్రారంభించి, కరువు చాయల సందర్భంగా ఉపాధిలో రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని కోరారు. రేషన్ షాపు ల ద్వారా బియ్యంతో పాటు కుటుంబం వాడుతున్న అన్ని రకాల నిత్యవసర సరుకులని సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చూస్తున్నామని గిరిజనులు సంఘం నాయకులకు తెలిపారు. గిరిజన సమస్యను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించి వారికి సొంత గ్రామాల్లోని ఉపాధిని కల్పించే ఏర్పాట్లు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -