నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కెటు ఉన్నత పాఠశాలలో సోమవారం నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేశామని మెడికల్ ఆఫీసర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులందరూ ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయంలో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వర్షాకాలంలో ఈగల వంటి కీటకాలు అనేక రోగాలను వ్యాప్తి చేస్తాయని, పురుగులను నివారించడం కోసం ఈ మాత్రలు బాగా పనిచేస్తాయని పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ విద్యార్థులకు తెలిపారు. రక్తహీనత బారిన పడకుండా అనేక రోగాలు రాకుండా ఈ మందులు నివారిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ ప్రసన్న, హెల్త్ అసిస్టెంట్ అరుణ, సైన్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
నులిపురుగుల మాత్రల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



