నవతెలంగాణ-ఆర్మూర్
మండలంలోని మగ్గిడి గ్రామంలో దమ్మడి ఎర్రవ్వ (ఎస్ సి మాల కుటుంబానికి సంబంధించిన) భూమిని కొందరు అక్రమ దారులు కబ్జా చేసి భూమి లోకి వస్తే భూమిలో పాతిపెడతాం అని కులం పేరుతో బూతులు తిడుతూ ఎర్రవ్వ పై ఆమె కూతురు పై దాడి చేస్తున్నారని బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న అన్నారు. పట్టణ ప్రెస్ క్లబ్ నందు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, 2005 లో జోగిన వ్యవస్థ రద్దు కావడానికి ప్రభుత్వం మగ్గిడి గ్రామం లో 360/1/3 నందు 1.18 గుంటల భూమిని ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన భూమిని నాకు దక్క కుండా కొందరు అక్రమంగా భూమిలో దోబీ ఘాట్ కట్టి రిగ్గు వేసి న మామిడి చిన్న గంగారాం, మామిడి గంగాధర్, మగ్గిడి పోశెట్టి, ఔట్ల చిన్న గంగారాం, రామాయొళ్ల భూమేష్, నూతిపల్లి శ్రీనివాస్ గార్లు దౌర్జన్యం కు పాల్పడుతున్నారని అన్నారు.
వీరిపై జిల్లా కలెక్టర్ కు, తహసిల్దార్ కు, పట్టణ పోలీస్ స్టేషన్ లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాము కానీ మాకు ఎలాంటి న్యాయం జరుతలేదు. కాబట్టి నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి చెందకుండా చేస్తే తాను చనిపోతానని ఎర్రవ్వ పత్రిక ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవైఎస్ మండల్ అధ్యక్షులు పింజ సుదర్శన్.. ఎం ఆర్ పి ఎస్ నాయకులు మార్క్ నాయకులు కళ్లెం భోజన్న తదితరులు పాల్గొని బాధితులకు అండగా ఉంటాము అని తెలిపారు. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యను ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



