Tuesday, July 14, 2026
E-PAPER
Homeసినిమా'భారతి`గా నటించడం నా అదృష్టం

‘భారతి`గా నటించడం నా అదృష్టం

- Advertisement -

‘లెనిన్’ విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘భారతి’ పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ చిత్రాన్ని నాగా ర్జున, సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష కులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని విజయవం తంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా మీడియాతో భాగ్యశ్రీ బోర్సే తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా గురించి, నా నటన గురించి ఎంతో మంచి మెసేజ్‌లు పంపుతున్నారు.
ప్రతి సినిమా మాకు ప్రత్యేకమే. ఈ సినిమా విషయంలో ఒక మంచి కథ దొరికింది. మేమంతా ఈ సినిమాను బలంగా నమ్మాం. మా నమ్మకం నిజం కావడంతో ఈ విజయం మరిం త భావోద్వేగంగా అనిపించింది.
నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేక్ష కులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తు న్నారు. తెలుగు అమ్మాయిలానే చూస్తున్నారు. వారి అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినే.
ఇది ఒక అందమైన కథ. దర్శకుడు కథ చెప్పినప్పుడే నా మనసును హత్తుకుంది. ఈ పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ‘భారతి’ పాత్రను ఇంతగా అభిమానిం చడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -