తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం రసాభాసాగా మారింది.
జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వ్యాపించాయి. ఇక ఈ మేరకు జానీ మాస్టర్, టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత వివరణ ఇచ్చేందుకు సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ,’కొన్ని వీడియోలు పట్టుకుని నాకు, శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారు. అవన్నీ ఫేక్. ఈ వీడియోలు చూసి చిరంజీవి కూడా షూటింగ్‌లో మాతో మాట్లాడారు. శేఖర్ మాస్టర్, నేను, చిరంజీవి కలిసి ఆనందంగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. శేఖర్ మాస్టర్ , నాకు, ఇతర మాస్టర్‌లకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. డాన్సర్ల్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ.18 లక్షలు విరాళంగా ఇస్తున్నానుఅని అన్నారు. ‘గత బాడీలో చాలా నిధులు దుర్వినియోగం అయ్యాయి. వాటిని ప్రశ్నించినం దుకు మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. మేం ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా ఎన్నికలు జరపడం లేదు. అన్నీ కూడా లీగల్‌గానే చేస్తున్నాం అని టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత చెప్పారు.
ఎలాంటి గొడవలు జరగలేదు : జానీ మాస్టర్
- Advertisement -
- Advertisement -



