– మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్
నవతెలంగాణ-సత్తుపల్లి
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జాతీయ జలమిషన్, జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్యాచ్ ద రెయిన్ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ… ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పడే వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం (క్యాచ్ ద రైయిన్) అనే నినాదం జలశక్తి అభియాన్‌లో ఒక ముఖ్య భాగమని తెలిపారు. వర్షపు నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అన్నారు.
మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన చైర్ పర్సన్ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో చైర్ పర్సన్ రెహానా కమల్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామంటూ చైర్ పర్సన్ రెహానా కమల్, కమిషనర్ కోండ్ర నరసింహతో పాటు పలు విభాగాలకు చెందిన మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మైసా శ్రీనివాసరావు, ఏఈ సురేష్, టీపీబీఓ కిరణ్, ఆర్ఐ కె.దిలీప్ కుమార్, వై. సుజాత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



