Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుర్ల ఇసుక క్వారీలోకి అన్ని గ్రామాల ట్రాక్టర్లకు అవకాశం కల్పించండి

కుర్ల ఇసుక క్వారీలోకి అన్ని గ్రామాల ట్రాక్టర్లకు అవకాశం కల్పించండి

- Advertisement -

డోంగ్లి తహసిల్దార్ కు మండల సర్పంచులు వినతి
నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో కుర్లా గ్రామస్తులు అజమయిషీ చెలాయిస్తున్నారని అన్ని గ్రామాల సర్పంచులు అన్నారు. ఇంతకు ముందు ఇసుక క్వారీలోకి అన్ని గ్రామాల ట్రాక్టర్లకు అనుమతులు లభించేవని తెలిపారు. తాజాగా మంగళవారం డోంగ్లీ మండల సర్పంచులు సంయుక్తంగా తహశీల్దార్ రంజిత్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషితో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఇబ్బందులు కలగకుండా డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామ శివారు ప్రాంతంలోని మంజీరా నది నుండి ఇసుకను తరలించడానికి  ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఇసుక క్వారీ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కుర్లా గ్రామాస్తులు మాత్రమే మంజీరా నది నుంచి ఇసుకను తీసుకుంటామని అంటున్నారని, ఇది ఎంత వరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే ఊరు ట్రాక్లర్లను ఇసుక క్వారీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. మండల పరిధిలో నిర్మిస్తున్న ఇందరమ్మ ఇండ్లు సకాలంలో పూర్తి కావాలంటే ఇసుక క్వారీలోకి అన్ని గ్రామాల ట్రాక్లర్లను అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బాచవార్ లక్ష్మణ్, మండలంలోని సర్పంచులు హలే బస్వంత్, సంగ్రామ్ పటేల్, శ్రీధర్, శ్రీకాంత్, దత్తు, నాయకులు విలాస్, శివారెడ్డి, పలువురు ట్రాక్టర్ యజమానులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -