Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌన్}
పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన ఓ బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఆలేర్ పట్టణంలో మంగళవారం ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు బస్‌స్టాండ్ పరిసరాల్లో ఒంటరిగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. బాలుడిని తల్లిదండ్రుల వివరాలు అడిగినా చెప్పలేకపోవడంతో, వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా సమాచారం చేరవేశారు. పట్టణానికి చెందిన క్రాంతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి కందుల సామ్సంన్, బాలుడు సోలోమన్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు  పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, బాలుడిని వారికి సురక్షితంగా అప్పగించారు. ఈ ప్రక్రియలో ఆలేరు సీఐ యాలాద్రి, ఎస్‌ఐ వినయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎన్ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజల భద్రత, పిల్లల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం అనే విషయాన్ని ఆలేరు పోలీసులు మరోసారి నిరూపించారు. బాలుడి  తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -