Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే ఖబర్దార్

సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే ఖబర్దార్

- Advertisement -

 నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని ఎనబోరా గ్రామ అభివృద్ధి విషయంలో ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ఆ వ్యక్తిపై ఆ గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన యూనుస్ పటేల్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం డోంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఎనాబొర నుంచి రాజన్న ఆలయం వరకు మొర్రంరోడ్డు, గ్రామాల్లో దాదాపుగా రూ. 50 లక్షల నిధులతో సీసీరోడ్ల నిర్మాణాలు, రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవన నిర్మాణం, 40 ఇందిరమ్మ ఇండ్లతో పాటు అదనంగా మరో 15 ఇండ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ గ్రామం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కండ్లు తెరిచి చూడాలని, ఊరికే ఇంట్లో కూర్చుని తప్పుడు పోస్టులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీపైనా.. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై తప్పుడు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో డోంగ్లి మండల సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ బాచావార్ లక్ష్మణ్ పటేల్, మండల సర్పంచులు హళ్ళే బస్వంత్, సంగ్రామ్ పటేల్, దత్తు, శ్రీధర్, శ్రీకాంత్, నాయకులు చాంద్ పటేల్, ధనుజయే పటేల్, దిన్దయాల్, ప్రవీణ్ పటేల్, విలాస్, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -