నవతెలంగాణ-ఆలేరు టౌన్
పాఠశాలలు తెరిచి నెల రోజులు గడిచిపోతున్నప్పటికీ ఇంతవరకు ఏకరూప దుస్తులు యూనిఫామ్ లు విద్యార్థులు అందలేదు. పాత దుస్తుల వేసుకొని విద్యార్థులు స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ పాఠశాలల ధీటుగా విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని విద్యాశాఖ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో నోచుకోవడం లేదు. పాఠశాల తెరిచిన వారంలోపే పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందాల్సి ఉండగా ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాత దుస్తులలోనే పాఠశాలలకి వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లో వైపు మళ్లించేందుకు ఉపాధ్యాయులు, బడిబాట ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న మెరుగైన సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.
ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ ఏకరూప దుస్తులు విద్యాశాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వేసవి సెలవులలోని విద్యార్థులకు స్కూలు ఓపెన్ చేసే సమయంలోగా, మహిళా సంఘాల ద్వారా దర్జీలకి క్లాత్ కుట్టడానికి ఇచ్చేది. ఏకరూప దుస్తుల కోడ్ కలర్ మార్చుతూ ఉండడంతో లేటు కారణంగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో బుక్స్ అందజేసినట్లు చెబుతున్నారు. మరికొంతమంది నూతనంగా జైన్ అయ్యే విద్యార్థులకు పుస్తకాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఒక్కో స్కూల్లో తగ్గుతూ ఒక్కో స్కూల్లో పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు ఉదయం వేళల్లో బ్రేక్ ఫాస్ట్ టిఫిన్ అందిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. వచ్చేనెల 15త్ ఆగస్టు నాటికైనా విద్యాశాఖ ద్వారా ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తారు వేచి చూడాల్సిందే.
డ్రెస్ కోడ్ మార్పు కారణంగానే ఎకరూప దుస్తుల పంపిణీకి జాప్యం: విద్యాధికారిని ఎర్ర లక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రతి సంవత్సరం విద్యార్థులకు పాఠశాలలలో అందించే ఏకరూప దుస్తులు, డ్రెస్ కోడ్ మార్పు కారణంగా ఏపియమయ్యాయి. జూన్ నెలలో మొదటి వారంలోనే స్కూల్ ప్రారంభంలోనే ప్రతి సంవత్సరం ఎకరూప దుస్తులు విద్యార్థులకు అందించాము. డ్రెస్ కోడ్ మార్పు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యార్థులకి ఎకరూప దుస్తులు అందించడంలో జాప్యం జరిగినది. తొందర్లోనే ఒక రూప దుస్తులు విద్యార్థులకు అందిస్తాం. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాల అందిస్తున్నాం.



