- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
విప్లవ యోధుల ఆశయ సాధనకు ప్రజలు కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ, విప్లవోద్యమంలో రాయల చంద్రశేఖర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి చింత నవీన్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు శ్రీరాం, పుల్లయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



