Tuesday, March 10, 2026
E-PAPER
Homeఆటలుగుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్‌

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, విధ్వంసకర మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ను తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఈ నియామకాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం తాజాగా అధికారికంగా ధ్రువీకరించింది. రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా, తన తరంలో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా పేరుగాంచిన హేడెన్ చేరికతో జట్టు కోచింగ్ బృందం మరింత బలోపేతమైంది.
హేడెన్ అంతర్జాతీయ కెరీర్‌
హేడెన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 273 మ్యాచ్‌లు ఆడి 15,000కు పైగా పరుగులు సాధించాడు. ఆధునిక వైట్-బాల్ క్రికెట్‌లో పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించే శైలికి అతను మార్గదర్శకుడిగా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ హేడెన్ తనదైన ముద్ర వేశాడు. 2008 నుంచి 2010 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను, 32 మ్యాచ్‌లలో 1,107 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2009 సీజన్‌లో 572 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2010లో అతను ఉపయోగించిన ‘మంగూస్ బ్యాట్’ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ బ్యాట్‌తోనే ఢిల్లీపై కేవలం 43 బంతుల్లో 93 పరుగులు బాదాడు. అదే ఏడాది చెన్నై తొలిసారి టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే దూకుడైన అనుభవాన్ని గుజరాత్ బ్యాటర్లకు పంచనున్నాడు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -