Wednesday, March 11, 2026
E-PAPER
Homeఆటలుఫుట్‌బాల్‌లో భారత్‌కు నిరాశ

ఫుట్‌బాల్‌లో భారత్‌కు నిరాశ

- Advertisement -

చైనీస్‌ తైపీ చేతిలో 3-1తో ఓటమి
ఎఎఫ్‌సి మహిళల ఆసియాకప్‌
సిడ్నీ:
ఎఎఫ్‌సి మహిళల ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భారతజట్టు నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన గ్రూప్‌-సి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళలజట్టు 1-3తో పరాజయాన్ని చవిచూసింది. సిడ్నీ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో 12వ ని.లో యు-యుషన్‌ 12వ ని.లో ఒక గోల్‌ కొట్టి చైనీస్‌ తైపీని 1-0 ఆధిక్యతలో నిలిపింది. ఆ తర్వాత భారత్‌ తరఫున కళ్యాణ్‌ 39వ ని.లో ఒక గోల్‌ చేయడంలో స్కోర్‌ 1-1తో సమమైంది. తొలి అర్ధభాగం అదనపు సమయంలో చైనీస్‌ తైపీ తరఫున హి-హుయాన్‌ ఒక గోల్‌ చేయడంలో తైపీ జట్టు 2-1 ఆధిక్యతలో నిలిచింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి చైనీస్‌ తైపీ జట్టు 2-1 ఆధిక్యతలో నిలువగా.. 77వ ని.లో యు-టింగ్‌ మరో గోల్‌ చేయడంలో తైపీ జట్టు 3-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారతజట్టులో రెండు మార్పులు చేసినా ప్రయోజనం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -