రూ.131కోట్ల నజరానా ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: టి20 ప్రపంచ కప్ 2026 వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. భారతజట్టులోని ఆటగాళ్లతోపాటు సహాయ సిబ్బందికి భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) భారీ నజరానా ప్రకటించింది. ఈమేరకు ఒక ప్రకటనలో 131కోట్ల రూపాయలను వారికి అందజేయనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధృవీకరించారు. ఐసిసి టి20 ప్రపంచ కప్‌ను మూడుసార్లు కైవసం చేసుకున్న ఏకైక జట్టు టీమిండియానే. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలోనూ ఒకటిగా టీమిండియా కొనసాగుతోంది. ఈ క్రమంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నట్లు సైకియా ఆ ప్రకటనలో తెలిపారు. అద్భుతమైన ప్రదర్శనతో టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టుకు బిసిసిఐ 2024లోనూ భారీ నజరానా ప్రకటించింది. అప్పుడు 125 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చి ఘనంగా సన్మానించింది. ఈసారి మరో ఆరు కోట్ల రూపాయలు పెంచి 131 కోట్ల రూపాయల బహుమతి ప్రకటించింది. ఇక ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాకు 21.5 కోట్ల రూపాయలు.. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 10.75 కోట్ల రూపాయలు అందజేశాయి.
ప్రపంచకప్ జట్టులో నలుగురికి చోటు
టి20 ప్రపంచకప్ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ఐసిసి మంగళవారం ప్రకటించింది. ఐసిసి అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. వీరిలో 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన సంజూ శాంసన్‌తోపాటు వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (317పరుగులు), ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (14 వికెట్లు)లకు చోటు దక్కింది. జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆడెన్ మార్‌క్రమ్ ఎంపికయ్యాడు. రన్నరప్ న్యూజిలాండ్, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్లలో ఒక్కరికి కూడా ఐసిసి జట్టులో చోటు దక్కలేదు.
జట్టు: మార్‌క్రమ్(దక్షిణాఫ్రికా) సారథిగా ఉన్న ఈ జట్టులో సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్థాన్), శాంసన్, ఇషాన్, హార్ధిక్, విల్ జాక్స్ (ఇంగ్లండ్), హోల్డర్ (వెస్టిండీస్), బుమ్రా, ఎంగిడి (దక్షిణాఫ్రికా), అదిల్ రషీద్ (ఇంగ్లండ్), ముజార్బనీ(జింబాబ్వే) అమెరికా పేసర్ షాడ్లే (12వ ఆటగాడిగా) చోటు దక్కించుకున్నారు.
టీమిండియా ఆటగాళ్లపై కనకవర్షం
- Advertisement -
- Advertisement -



