Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్16న కట్టంగూర్ సంత వేలం

16న కట్టంగూర్ సంత వేలం

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
ఈనెల 16వ తేదీన కట్టంగూరు సంత వేలంపాట గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి వేలం పాటలో పాల్గొనే వారు తహసిల్దార్ ధ్రువపరిచిన ఐదు లక్షల విలువైన సాల్వెంన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, 15 తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు 2 లక్షల రూపాయల డీడీని గ్రామపంచాయతీ కార్యాలయంలో దాఖలు చేసి పేరు నమోదు చేసుకోవాలని, తైబజార్ వేలంపాటలో పాల్గొనేవారు లక్ష రూపాయల విలువైన డీడీని దాఖలు చేయాలని పేర్కొన్నారు. రహదారి పాటకు 3000 రూపాయల షెడ్యూలు ఫీజుగా, తైబజార్ కు 2000 రూపాయల షెడ్యూలు ఫీజుగా చెల్లించాలని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -