నవతెలంగాణ – పరకాల
పరకాల నియోజకవర్గంలో ఇటీవల మృతిచెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రముఖుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి వారికి భరోసానిచ్చారు. పరకాల పట్టణంలో మృతిచెందిన బీఆర్ఎస్ నాయకుడు మంద విజేందర్ పార్థివదేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, ఇటీవల కన్నుమూసిన స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల చిన్న మల్లారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అదేవిధంగా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ నీటి సంఘం చైర్మన్ పల్లెబోయిన రవి తల్లి సాయమ్మ మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో చల్లా ధర్మారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. హైబోతుపల్లి సర్పంచ్ కాసగాని సంపత్ పెద్దనాన్న పెద్ద సమ్మయ్య మృతి పట్ల సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో ప్రతి కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



