- Advertisement -
నవతెలంగాణ – పరకాల
బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆర్‌సీఓ రాజ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ .. జిల్లాలోని బీసీ గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. విద్యార్థులకు నిత్యం నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు సన్నీ పాల్గొన్నారు.
- Advertisement -



