నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని నస్తూరుపల్లి గ్రామ పంచాయతీ 5వ వార్డులో ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని వార్డు సభ్యుడు అయిటిపాముల శ్రావణ్ కుమార్ వెంటనే స్పందించి పరిష్కరించించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించి, వారితో కలిసి దగ్గరుండి మరమ్మతులు చేయించారు.
విద్యుత్ లైన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను సిబ్బంది సరిచేయడంతో తిరిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. సమస్యను వెంటనే గుర్తించి పరిష్కారం చేయించినందుకు గ్రామస్థులు వార్డు సభ్యుడు అయిటిపాముల శ్రావణ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలు ఎదురైన వెంటనే స్పందించి పరిష్కరించడం తన బాధ్యత అని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు ఎప్పుడూ ముందుండి పనిచేస్తానని పేర్కొన్నారు.



