Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుచర్చిల అభివృద్ధికి నిధులు మంజూరు అభినందనీయం

చర్చిల అభివృద్ధికి నిధులు మంజూరు అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం:

కాటారం మండల కేంద్రంలోని రివైవ్ చర్చి అభివృద్ధి కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల రివైవ్ చర్చి పాస్టర్ సురేష్ హర్షం వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా చర్చికి తగిన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి ఈసారి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో చర్చిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

అయితే ఈ విషయాన్ని కొందరు జీర్ణించుకోలేక కాటారం సబ్ డివిజన్ కమిటీ పెద్దలు తనపై అనవసర ఆరోపణలు చేస్తూ నిధుల మంజూరును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పాస్టర్ సురేష్ ఆరోపించారు. గతంలో సుమారు 15 సంవత్సరాల క్రితం మంథని డివిజన్ పరిధిలో కూడా రూ.1.50 కోట్ల నిధులను మంత్రి శ్రీధర్ బాబు మంజూరు చేసిన విషయం గుర్తు చేశారు.

అప్పుడు నిధులు పొందిన వారు ప్రస్తుతం ఉన్న కమిటీతో కలిసి ఈ విధంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అవసరం ఉన్న వారు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తే ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -