Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవార్తాపత్రికల సమాచారం డిజిటలైజేషన్‌

వార్తాపత్రికల సమాచారం డిజిటలైజేషన్‌

- Advertisement -

మనసు ఫౌండేషన్‌ సేవలకు మీడియా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌పాత తెలుగు, ఆంగ్ల, ఉర్దూ వార్తాపత్రికల సమాచారాన్ని డిజిటలైజేషన్‌ ‌కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మీడియా అకాడమి చైర్మెన్‌ కె శ్రీనివాస్‌‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో మనసు ఫౌండేషన్ ప్రతినిధులతో తెలంగాణ మీడియా అకాడమిలో డిజిటల్ ఆర్కైవ్స్‌పై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌‌రెడ్డి మాట్లాడుతూ వార్తాపత్రికలను డిజిటలైజేషన్‌ ‌చేసి ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవాలని చెప్పారు. జర్నలిస్టులు, పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ఆసక్తిగల వారికి లక్షలాది పేజీల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు సంబంధించిన సుమారు ఎనిమిది లక్షల పేజీలు డిజిటల్ ఆర్కైవ్‌లో నిక్షిప్తమై ఉన్నాయని వివరించారు. ఈ విలువైన సమాచారాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఆర్కైవ్స్‌ను మరింత అభివృద్ధి చేయడం, సమాచార శోధనను సులభతరం చేయడం వంటి అంశాలపై మనసు ఫౌండేషన్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామని వివరించారు. మనసు ఫౌండేషన్ దాదాపు 28 లక్షల పేజీల చారిత్రక వార్తాపత్రికలు, పుస్తకాలు, గెజిట్లు, మ్యాగజైన్లు, ఇతర విలువైన పత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరిచిన విశిష్ట సేవలను ఆయన అభినందించారు. భవిష్యత్ తరాలకు చారిత్రక సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. డిజిటల్ ఆర్కైవ్స్, ఆర్కైవ్ నిర్వహణ, మీడియా పరిశోధన, జర్నలిజం చరిత్ర, డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించాలని మనసు ఫౌండేషన్ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో మనసు ఫౌండేషన్ చైర్మెన్ రాయుడు, సభ్యులు చంద్రమౌళి, దాము బాలాజీ, వి శేషతలపతి సాయి, ఎవి రమణమూర్తి, జగన్, తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. అకాడమి చైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డి అభినందన

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -