Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంఅఖిలపక్ష భేటీలో రగడ.. విపక్షాల వాకౌట్

అఖిలపక్ష భేటీలో రగడ.. విపక్షాల వాకౌట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో గందరగోళం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలకు ఆహ్వానం పలకడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీల నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇది కేవలం సాంకేతిక నిరసన మాత్రమేనని తెలిపి, కొద్ది నిమిషాలకే తిరిగి సమావేశంలో పాల్గొన్నారు.

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల అజెండాను చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం మొదలైన వెంటనే కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ) సహా పలు విపక్ష పార్టీల నేతలు నిరసనగా బయటకు వెళ్లిపోయారు.

టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసిన సుమారు 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో చేరారు. అయితే, ఈ విలీనానికి లోక్‌సభ స్పీకర్ నుంచి అధికారికంగా ఎలాంటి ఆమోదం లభించలేదని, పార్లమెంట్ రికార్డుల్లో వారు ఇంకా టీఎంసీ ఎంపీలుగానే ఉన్నారని విపక్షాలు వాదించాయి. పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఎన్‌సీపీఐ అనే పార్టీయే లేనప్పుడు వారిని ఎలా ఆహ్వానిస్తారని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ప్రశ్నించారు. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని విపక్షాలు ఆరోపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -