నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని చేగుంట గ్రామంలో ఆదివారం గ్రామస్తులు వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విడివిడిగా తమ వ్యవసాయ పొలాలకు వెళ్లి సహపంక్తి భోజనం చేశారు. ముందుగా గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించారు. కొత్త బట్టలు ధరించి పిల్లాపాపలతో కలిసి వ్యవసాయ పొలాలకు వెళ్లి అక్కడే వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అనంతరం వివిధ ఆటల పోటీలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కిల్లే మల్లయ్య మాట్లాడుతూ గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించడం వల్ల శుభాలు కలుగుతాయని అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం వల్ల ప్రేమానురాగాలు పెంపొందుతాయని తెలిపారు. వనమహోత్సవం సందర్భంగా గ్రామంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా పోలీసులు శరత్ గౌడ్, సలేశ్వరం బందోబస్తు నిర్వహించి గ్రామం అంతట తిరుగుతూ పర్యవేక్షించారు.
ఘనంగా వన మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



