Saturday, March 14, 2026
E-PAPER
Homeసినిమాసీనియర్‌ నిర్మాత అర్జున రాజు ఇకలేరు

సీనియర్‌ నిర్మాత అర్జున రాజు ఇకలేరు

- Advertisement -

ప్రముఖ నిర్మాత, రోజా ఆర్ట్స్‌ అధినేతలలో ఒకరైన ఎం.అర్జునరాజు (80) ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రోజా ఆర్ట్స్‌ బ్యానర్‌పై శివరామరాజు భాగస్వామ్యంతో ఆయన ఎన్టీఆర్‌తో ‘కొండ వీటి సింహం’, ‘వేటగాడు’, చిరంజీవితో ‘జేబు దొంగ’, నాగార్జునతో ‘బావ నచ్చాడు’, జగపతి బాబుతో ‘జగపతి’, అల్లరి నరేష్‌తో ‘మా అల్లుడు వెరీగుడ్‌’, హిందీతో ధర్మేంద్రతో ‘జానీ దోస్త్‌’, జితేంద్రతో ‘ఫర్జ్‌ ఔర్‌ కానూన్‌’ వంటి తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రోజా ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, రోజా ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్ల మీద కూడా పలు చిత్రాలను నిర్మించారు. మంచి చిత్రాల నిర్మాణంతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన అర్జునరాజు మృతి పట్ల తెలుగు చిత్ర నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. నేడు (శనివారం) జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -