Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాహితీ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

సాహితీ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

 ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్
నవతెలంగాణ -పరకాల 

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సాహితీ జూనియర్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ప్రభుత్వ మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు లేకుండానే 2026-27 విద్యా సంవత్సరానికి ఈ కళాశాలలో అడ్మిషన్లు చేపట్టి తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ కళాశాలలో చేరుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు మరియు హనుమకొండ డీఐఈవో స్పందించకపోవడం సరికాదని విమర్శించారు. అనుమతులు లేని కళాశాలలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైనా కళాశాలలో చేర్పించే ముందు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గుర్తింపును పరిశీలించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -