సైకిల్ పై శబరిమల బయలుదేరిన భక్తుడు..

నవతెలంగాణ- ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని పెరికిట్ కు చెందిన బాలరాజ్ స్వామి శుక్రవారం 1450 కిలోమీటర్లు గల శబరిమలకు సైకిల్ పై బయలుదేరినాడు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం నుండి ఈయన బయలుదేరగా పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అంకాపూర్ లో భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుడు.. మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ అనే ముస్లిం సోదరుడు శుక్రవారం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులలో కులమత విభేదాలు ఉండవద్దని అందరూ కలిసి ఉండాలని, ఐకమత్యాన్ని చాట్ ఎందుకు భిక్షను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గురుస్వాములు నాగేష్ శర్మ , నంబి నరేష్ , అల్లా కొండ భోజన్న, వడ్ల శ్రీనివాస్, సుధా సీడ్స్ నితిన్, మచ్చర్ల రమేష్, కన్నె స్వామి నలంద ప్రసాద్ తదితరులు మహమ్మద్ రఫీక్ సేవా నిరతిని కొనియాడారు.
Spread the love