- Advertisement -
నవతెలంగాణ మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదం చోటుచేసుకుంది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందాడు. కుమారుడు హర్షవర్ధన్ దుఃఖాన్ని దిగమింగుకుని ఈ రోజు ప్రారంభమైన 10 పరీక్షలకు హాజరయ్యాడు. గుండాల మండలం వస్తకొండూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎల్లయ్యకు నిన్న ఉదయం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో నల్గొండలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా ఎల్లయ్య మృతి చెందాడు.
- Advertisement -



