Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ

పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్ లో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం పొందిన పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ కొక్కుల రమాకాంత్ సంతాప సభా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మున్సిపల్  చైర్ పర్సన్ గోనె లహరి రఘు, ఈ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరవత్రి రాజశేఖర్, (చార్టెడ్ అకౌంటెంట్ ) పద్మశాలి కౌన్సిలర్స్ జో శ్రీనివాస్,బండారి గీత శాల ప్రసాద్,మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్,పట్టణ పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మ్యాక హేమలత,8 తర్పల అధ్యక్షులు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. ఆయన  కుమారులు కొక్కుల ఉమాకాంత్, రేవంత్ తండ్రి చిత్రపటానికి పూలమాలలువేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘననివాళులర్పించి,ఆత్మశాంతికై 2  నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమై…నింగికేగిన ఆయన ఆత్మ శాంతించాలని ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి ఘటిస్తూ,కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ సాంత్వన కలగాలని అక్షర భాష్పాంజలి ఘటించారు. రిటైర్డ్ టీచర్ జింధం నరహరి స్వీయ రచనలో పాడిన కన్నీటి వీడుకోలిదే ఓ రమాకాంతన్న…నీ సేవకు జేజేలివే అనే పాట అందరిని దుఖః సాగరంలోకి* *ముంచెత్తింది.  ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం కోశాదికారి భాస్కర్,,ఉపాధ్యక్షులు ఘణపురం సంతోష్, కార్యదర్శులు జింధం నరహరి, బొడ్డు సాగర్  తర్ప అధ్యక్షులు అంబటి కృష్ణ హరి బండి అనంతరావు, చిట్ల యగ్నేష్,రుద్ర రాజేశ్వర్, సదుమస్తుల గణపతి, బండి రాజు, రవి కాక, మానేటి లింబాద్రి, అందె నాగేశ్వర్ రావు, రుద్ర రవి, సత్య శ్రీను, నూకల శేఖర్,దాసరి గోపి, వంశీ, మ్యాక శ్రీను  పట్టణ పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -