Wednesday, July 22, 2026
E-PAPER
Homeసినిమాఆందోళన వద్దు

ఆందోళన వద్దు

- Advertisement -


కొత్త సినిమా చిత్రీకరణలో హీరో బాలకృష్ణకు గాయమైంది. గోపిచం ద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన తన 111వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది.
ఓ కీలక యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరి స్తుండగా బాలకృష్ణకి చిన్న మసిల్ టియర్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తెలిజేశారు. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉందని, సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది.అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నాం` అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘వీర సింహారెడ్డి’ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య, గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే, బాలయ్య కోలు కోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెట్టారు.
బాలా బాబాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నాను. – ఎన్టీఆర్‌
బాబాయ్‌ మీరు త్వరగా కోలు కోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయ డానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. – కల్యాణ్‌రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -