అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’.
ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌ను జరుపుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీంకి షీల్డ్స్‌ను అందించారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ,’‘డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పిలిచి షీల్డ్స్ ఇవ్వడం అనేది అప్పుడెప్పుడో సెలెబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’ కోసం ఇలా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతీ చోటా ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతుంటే ఆనందంగా ఉంది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అందరూ ప్రేమించి ఈ మూవీని చేశారు. ఆ ప్రేమను ఆడియెన్స్, అభిమానులంతా తిరిగి చూపించారు. ఈ ప్రేమ కోసం, అరుపుల కోసమే అఖిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడుఅని అన్నారు. ‘మాకు సపోర్ట్ చేస్తున్న అక్కినేని అభిమానులందరికీ థాంక్స్. తమ్ముడు కాస్త లేట్‌గా వచ్చినా.. అభిమానులు మాత్రం లేటెస్ట్‌గా సపోర్ట్ చేశారు అని నాగ చైతన్య చెప్పారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ,’రెండో రోజు నుంచే మాకు థియేటర్లు పెంచి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు థాంక్స్. మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది` అని తెలిపారు.
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..
- Advertisement -
- Advertisement -



