నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పున్ణ నిర్మించిన తెలంగాణ శాసనమండలిలో తన చాంబర్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం మహేందర్‌రెడ్డి, సతీమణి పట్నం సునీతారెడ్డి, కుమారుడు రినీష్‌రెడ్డితో కలిసి మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు వేద పండితులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పూజల అనంతరం ఆయన తన ప్రధాన ఛాంబర్‌లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కార్యదర్శి నర్సింహాచార్యులు, మరో అధికారి ఉపేందర్‌రెడ్డి, చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డికి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు సుధాకర్, చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి, పీఎస్ ప్రకాష్, అదనపు పీఎస్ నాగిరెడ్డి, పీఆర్‌ఓ మల్లారెడ్డి, పీఏలు బాలు, రాజు, రాజేందర్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
మండలి చాంబర్‌లో చీఫ్‌విప్ పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



