Wednesday, July 22, 2026
E-PAPER
Homeజాతీయంసొరంగంలో ప్రమాదం

సొరంగంలో ప్రమాదం

- Advertisement -

గౌహతి: సిక్కింలోని నామ్‌చి జిల్లా, సమర్‌దుంగ్-జోలుంగే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో 12 మంది మరణించగా, కనీసం మరో 13 మంది లోపల చిక్కుకుపోయారు . “సమర్‌దుంగ్‌లోని ఎన్ హెచ్ పీసీ తీస్తా స్టేజ్ VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటివరకు తొమ్మిది మరణాలు నమోదయ్యాయి,” అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
జలవిద్యుత్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ .. ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్ లో అధికారులతో సహా మొత్తం 25 మంది కార్మికులు ఏడీఐటీ-3 సొరంగం లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రాజెక్ట్‌లో 13.8 కి.మీ , 13.7 కి.మీ పొడవున్న రెండు ప్రధాన సొరంగాలు ఉన్నాయి. సిక్కింలో కూలిపోయిన సొరంగం సివిల్ నిర్మాణ పనులను చేపడుతున్న పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (పీఈఎల్), చిక్కుకు పోయిన వారిని రక్షించడానికి తమ ప్రాజెక్ట్ బృందం విపత్తు నిర్వహణ దళాలు , స్థానిక అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేస్తోందని తెలిపింది. రక్షణ చర్యలకు మద్దతుగా అవసరమైన వనరులు, పరికరాలు, సహాయాన్ని అంది స్తున్నామని, సొరంగాన్ని స్థిరీకరించడానికి , రక్షణ బృందాలు ప్రభావిత ప్రాంతానికి చేరుకోవడంలో సహాయపడటానికి తమ సైట్ ఇంజనీరింగ్ బృందం అధికారులతో కలిసి నిరంతరం (రౌండ్-ది-క్లాక్) పనిచేస్తోందని కంపెనీ పేర్కొంది. తమ వాళ్లను కోల్పోయిన వారు ఆస్పత్రి వద్దకు రాగా రోదనలతో నిండిపోయింది. ఇప్పటికీ కానరాని తమ వాళ్ల ఆచూకీ ఏమైందని.. పలువురు అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. పరిస్థితి గురించి ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -