Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈత మొక్కలు నాటిన సర్పంచ్

ఈత మొక్కలు నాటిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి 
మండల కేంద్రమైన మిరుదొడ్డిలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీగా ఈత మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై, మిరుదొడ్డి గ్రామ సర్పంచ్ మహేశ్వరి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ మహేశ్వరి, ఎక్సైజ్ ఎస్సై జహీర్, గౌడ సంఘం అధ్యక్షులు పరశురాములు మాట్లాడుతూ.. గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సుమారు 1000 ఈత మొక్కలను నాటినట్లు తెలిపారు. మరోచోట కూడా 1000 ఈత చెట్లను నాటడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గౌడ కులవృత్తి అభివృద్ధికి ఈత చెట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు నేరెళ్ల వెంకట్ గౌడ్, అంజాగౌడ్, చాట్లపల్లి పరశురాములు, సల్లూరు మల్లేశం, నారాయణ, బాలమల్లు, మహేష్, రాజా గౌడ్ తో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -