రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు హేయమైన చర్య
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి
నవతెలంగాణ – మిరుదొడ్డి
విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ కావడంతో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పోలీసులు లాఠి చార్జ్ చేసి తీవ్రంగా గాయపరచడంతో, విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపడితే, బీజేపీ ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కనుక రెడ్డి చేతుపై పెట్రోల్ పడి మంటలు అంటుకున్నాయి. స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్, మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, భాస్కర్ మహేందర్, స్వామి, మహేష్, జాంగిర్, భూమా గౌడ్, కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.
దేశంలో బీజేపీ అరాచక పాలన కొనసాగుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


