– ఈనెల 23వ ఎల్ నీ నో ప్రభావం పై అధికారులతో సమీక్ష : జిల్లా కలెక్టర్ కె హైమావతి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత నిర్మాణం అయ్యేంతవరకు తాత్కాలికంగా విద్యార్థునులకు పట్టణంలో 20 వ వార్డులో గల రైతు బజార్ భవనంలో విద్యార్థులకు శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంతో కలిసి అన్ని సదుపాయాలను సక్రమంగా కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. బుధవారం హుస్నాబాద్ లో విద్యార్థునుల వసతి కోసం కేటాయించిన హుస్నాబాద్ మొదటి, రెండవ అంతస్తును సందర్శించి అందులో విద్యార్థునుల వసతికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు మరియు శాతవాహన ఇంజనీరింగ్ వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఐ ఓ సి కార్యాలయాన్ని సందర్శించారు.
ఈనెల 23న గురువారం హుస్నాబాద్ ఐఓసిలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ 7 మండలాలకు సంబంధించి వానకాలం – 2026 ఎల్ నీ నో ప్రభావం ఎదుర్కునేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశ ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హుస్నాబాద్ నియోజవర్గ ఎల్ నీ నో ప్రభావం ఎదుర్కునేందుకు నిర్వహించే సన్నాహక సమావేశానికి 3 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామపంచాయతీ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ తదితరులు శాఖల అధికారులందరికీ వస్తారని పేర్కొన్నారు . వారి యొక్క యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చెయ్యాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారిగా అధికారులకు సిట్టింగ్, 3 జిల్లాలు 7 మండలాలు కావున వాటర్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సమావేశానికి ఎక్కడ కూడా లోటు కాకుండా చూసుకోవాలనీ ఆర్డీఓ రామ్మూర్తి నీ ఆదేశించారు.



