Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంప్ర‌తిపక్షాల ఆందోళ‌న‌ ఉధృతం

ప్ర‌తిపక్షాల ఆందోళ‌న‌ ఉధృతం

- Advertisement -

విద్యార్థులపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
​సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్‌ ‌మార్చ్‌లో విద్యార్థులు, యువతపై పోలీసుల క్రూర‌త్వానికి, దేశ విద్యావ్యవస్థలో నెలకొన్న సందిగ్ధతకు వ్య‌తిరేకంగా ప్ర‌తిపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో నల్లదుస్తులతో నిరసన బాట పట్టాయి. పార్లమెంట్‌లోని మకర ద్వారం ఎదురుగా జరిగిన ఈ ఆందోళనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక వాద్రా, కెసి వేణుగోపాల్, సమాజ్ పార్టీ నేత‌ అఖిలేశ్‌ ‌యాదవ్‌, ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అవధేష్ ప్రసాద్, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్‌, ఎస్‌.వెంక‌టేష‌న్‌, ఎఎ ర‌హీం, సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్‌, జెఎంఎం ఎంపీ మ‌హువా మాంఝీ, టీఎంసీ ఎంపీలు మ‌హువా మొయిత్రా, సౌగ‌త్ రాయ్‌, ఆర్జేడీ ఎంపీ మ‌నోజ్ కుమార్ ఝా త‌దిత‌రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించగా, ఎస్పీ ఎంపీలు నల్ల కండువాలు వేసుకున్నారు. ‘పేపర్ లీక్’, సేవ్ లైవ్స్-స్టాప్ నీట్’ అనే ప్లక్లార్డులు పట్టుకొని ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ని పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన‌ తర్వాతే ఎలాంటి చర్చ అయినా ఉభయ సభల్లో జరిపేందుకు సిద్ధమని నేతలు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -