Thursday, July 23, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీక నవతెలంగాణ

ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీక నవతెలంగాణ

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ 11వ వార్షికోత్సవానికి ఆహ్వానించిన సీజీఎం, ఎడిటర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రత్యామ్నాయ జర్నలిజానికి నవతెలంగాణ దినపత్రిక ప్రతీక అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ కొనియాడారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవానికి రావాలని కోరుతూ బుధ వారం హైదరాబాద్‌‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యా లయంలో జాన్‌‌వెస్లీకి ఆ పత్రిక సీజీఎం పి.ప్రభాకర్‌, ఎడిటర్‌ ‌రాంపల్లి రమేశ్‌, జనరల్‌ ‌మేనేజర్‌ ‌లింగారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా ‘రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికాస్వేచ్ఛ’ అంశంపై నిర్వహించనున్న సెమి నార్‌‌లో ప్రసంగించాలని కోరారు. వార్షికోత్సవానికి వస్తామని జాన్‌‌వెస్లీ హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రధానస్రవంతిలో ఒక సెక్షన్‌ ‌మీడియా పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కప్పిపెడుతున్న తరుణంలో నవతెలంగాణ పత్రిక వాస్తవాలను వెలికి తీస్తూ రాయడం గొప్ప విషయమన్నారు. ప్రజా ఉద్యమాలకు నవతెలంగాణ దినపత్రిక అండగా నిలుస్తున్నదని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -