నవతెలంగాణ-పాల్వంచ
టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు పది ప్రాంతాల్లో ఏకకాలంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నగర్‌లోని వెంకటరమణ బంధువుల ఇండ్లలో బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమిషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.
టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



